
వకీల్ సాబ్ రిలీజ్ కాకముందే క్రిష్ తో సినిమా ముహూర్తం పెట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ తర్వాత హరీష్ శంకర్ డైరక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తారని తెలుస్తుంది. హరీష్ శంకర్ ఈ సినిమా కథ ఎన్టీఆర్ కోసం రాస్తే తారక్ రిజెక్ట్ చేయడంతో పవన్ కు చెప్పి ఓకే చేయించుకున్నాడని టాక్ వినిపిస్తుంది. ఖుషి తర్వాత పదేళ్లు సినిమాలు చేస్తున్నా హిట్టు కొట్టని పవర్ స్టార్ కు గబ్బర్ సింగ్ తో సూపర్ హిట్ ఇచ్చాడు హరీష్ శంకర్ అందుకే హరీష్ శంకర్ మీద పవన్ నమ్మకం ఉంచారు.
ఈ ఇయర్ ఎండింగ్ లో ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తుంది. రీసెంట్ గా ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అయినా హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ ను మించే సినిమా తీస్తానని ప్రామిస్ చేశాడు. గద్దలకొండ గణేష్ తో హిట్ అందుకున్న హరీష్ శంకర్ పవర్ స్టార్ తో సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి. ఎన్టీఆర్ వద్దన్నా కథ పవన్ మెచ్చేలా చేయగా సినిమా హిట్టు రిజల్ట్ రిపీట్ చేస్తాడని అంచనా వేస్తున్నారు.