
లాక్ డౌన్ కారణంగా రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు అన్ని వాయిదా పడ్డాయి. ఇప్పటికే కొన్ని సినిమాలు ఓటిటిలో రిలీజ్ చేయగా మరికొన్ని సినిమాలు అదే బాట పట్టనున్నాయి. ఇక బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ గులాబో సితాబో కూడా డిజిటల్ స్ట్రీమింగ్ లో రానుంది. అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాను మే జూన్ 12న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. సుజిత్ సిర్కార్ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానా నటించారు.
గత ఏడాది నవంబర్ లోనే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఈ ఇయర్ ఫిబ్రవరి 28 రిలీజ్ ఎనౌన్స్ చేయగా అప్పుడు కూడా వాయిదా పది ఏప్రిల్ 17 రిలీజ్ ఎనౌన్స్ చేశారు. అప్పటికే లాక్ డౌన్ లో ఉండటంతో గులాబో సితాబో సినిమా రిలీజ్ కు అడ్డంకి ఏర్పడ్డది. అయితే ఇప్పటికే కొన్ని సినిమాలు ఓటిటిలో రిలీజ్ అవుతుండగా ఈ సినిమాను కూడా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేస్తున్నారు.