
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పింక్ రీమేక్ గా వస్తున్న వకీల్ సాబ్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తి కాగానే క్రిష్ డైరక్షన్ లో సినిమా చేస్తారని తెలుస్తుంది. ఇక ఇదే లైన్ లో హరీష్ శంకర్ సినిమా కూడా ఉంది. ఇక ఈ సినిమాలతో పాటుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా కూడా ఉంటుందని తెలుస్తుంది. త్రివిక్రమ్, పవన్ కాంబో అంటే ఆ అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో తెలిసిందే. జల్సా, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి మూడు సినిమాలతో అలరించిన ఈ కాంబో మరోసారి కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తుంది.
వకీల్ సాబ్ తర్వాత క్రిష్ సినిమా, హరీష్ శంకర్ సినిమా రెండు ఒకేసారి షూటింగ్ చేస్తారట. ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమా ఉంటుందని అంటున్నారు. త్రివిక్రమ్ ఈలోగా తారక్ తో చేయాల్సిన సినిమా పూర్తి చేస్తాడని అంటున్నారు. మొత్తానికి త్రివిక్రమ్ తో పవన్ సినిమా కోసం వెయిట్ చేస్తున్న మెగా, పవర్ స్టార్ ఫ్యాన్స్ కు ఇదో గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అల వైకుంఠపురములో సక్సెస్ తో తన సత్తా చాటిన త్రివిక్రమ్ తారక్ సినిమాతో కూడా హిట్టు కొట్టాలని చూస్తున్నాడు.