
ఈమధ్య దర్శకులు సినిమాలతో పాటుగా వెబ్ సీరీస్ ల మీద కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. స్టార్ డైరక్టర్స్ వెబ్ సీరీస్ లను డైరెక్ట్ చేయడం కుదరకపోవడంతో వెబ్ సిరీస్ నిర్మాతలుగా మారుతున్నారు. టాలీవుడ్ క్రేజీ డైరక్టర్ క్రిష్ ఇప్పటికే ఆహా ఓటిటిలో వెబ్ సీరీస్ నిర్మిస్తున్నారని తెలిసిందే. రీసెంట్ గా హాట్ స్టార్ నుండి కూడా క్రిష్ కు భారీ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది. ఇక ఇప్పుడు క్రిష్ బాటలో మరో క్రేజీ డైరక్టర్ హరీష్ శంకర్ కూడా వెబ్ సీరీస్ ల మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని తెలుస్తుంది.
గద్దలకొండ గణేష్ తర్వాత కొద్దిపాటి గ్యాప్ ఇచ్చిన హరీష్ శంకర్ తన నెక్స్ట్ సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు స్క్రిప్ట్ పూర్తి చేశాడట హరీష్ శంకర్. ఇక ఇదే కాకుండా క్రిష్ లానే వెబ్ సీరిస్ లను ప్రొడ్యూస్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. అసలైతే హరీష్ శంకర్ దర్శక నిర్మాతగా దాగుడుమూతలు సినిమా చేయాలని అనుకున్నాడు. మల్టీస్టారర్ సినిమాకు ఎవరు ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో వెనక్కి తగ్గాడు. ఇప్పుడు క్రిష్ బాటలోనే వెబ్ సీరీస్ లను నిర్మించాలని చూస్తున్నాడు. మరి నిర్మాతగా హరీష్ శంకర్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.