
లాక్ డౌన్ టైం లో ఆర్జీవీ సైలెంట్ గా ఉన్నాడేంటి అనుకునేలోగా క్లైమాక్స్ టీజర్ తో అందరికి షాక్ ఇచ్చాడు రామ్ గోపాల్ వర్మ. మియా మాల్కోవా లీడ్ రోల్ లో వర్మ డైరక్షన్ లో వస్తున్న సినిమా క్లైమాక్స్. ఈ సినిమాను ఎప్పుడు తీశాడో తెలియదు కానీ టీజర్ మాత్రం అలా రిలీజ్ అయ్యిందో లేదో ఇలా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వర్మ ఫ్రేమ్ లో మియా మాల్కోవా అందాలు ఆడియెన్స్ ను అలరించేలా ఉన్నాయి.
టీజర్ తో షాక్ ఇచ్చిన ఆర్జీవీ మరో నాలుగు రోజుల్లో క్లైమాక్స్ ట్రైలర్ తో వస్తాడని తెలుస్తుంది. మే 18న ఉదయం 9:30 నిమిషాలకు ట్రైలర్ వస్తుందట. మియా మాల్కోవా అందాలే హైలెట్ గా తెరకెక్కించిన ఈ సినిమా కథ కథనాలు ఎలా ఉంటాయో ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. సమ్మర్ లో హీటెక్కించే టీజర్ రిలీజ్ చేసిన ఆర్జీవీ క్లైమాక్స్ పై అందరి దృష్టి పడేలా చేసుకున్నాడు.