
టాలీవుడ్ హీరోల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయినా రానా ఫైనల్ గా తాను పెళ్ళిచేసుకుని అమ్మాయి గురించి బయటపెట్టాడు. దగ్గుబాటి వారసుడు రానా మిహీక బజాజ్ ను పెళ్లాడబోతున్నాడు. ఈ విషయాన్ని రానా తన ఇన్ స్టాగ్రామ్ లో ఎనౌన్స్ చేశాడు. మిహీక తో దిగిన పిక్ షేర్ చేస్తూ ఫైనల్లీ తాను ఒప్పుకుంది అంటూ కామెంట్ చేశాడు. కొన్నాళ్లుగా రానా పెళ్లి గురించి వార్తలు వస్తున్నా అతను ఎవరిని చేసుకుంటాడా అన్నది మాత్రం తెలియలేదు.
తను పెళ్లాడే అమ్మాయి గురించి స్వయంగా ప్రకటించి షాక్ ఇచ్చాడు రానా. టాలీవుడ్ హీరోల పెళ్లి ప్రస్తావన వస్తే ప్రభాస్ తో పాటుగా ఆ వెంటనే రానా పేరు వినిపించేది. ఫైనల్ గా రానా కూడా తన సోల్ మెట్ ను ఎంచుకున్నాడు. రానా ఎనౌన్స్ మెంట్ కు మిగతా హీరోల నుండి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. మెగాస్టార్ చిరంజీవి కూడా రానాకు స్పెషల్ విషెస్ అందించడం విశేషం. హీరోయిన్స్ శృతి హాసన్, హాన్సిక కంగ్రాట్స్ అంటూ కామెంట్ చేయగా సమంత మాత్రం చచ్చాడు అంటూ కామెంట్ పెట్టడం అందరికి షాక్ ఇచ్చింది.