తండ్రి పాత్రలో బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత బి.గోపాల్ డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమా కథ ఇదే అంటూ ఒక లైన్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో చెక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో బాలయ్య బాబు తండ్రి పాత్రలో కనిపిస్తాడని తెలుస్తుంది. సినిమాలో బాలకృష్ణ కూతురిగా ఒక యువ హీరోయిన్ నటిస్తుందని టాక్. 

బాలయ్య బాబు సినిమాలో తన రియల్ ఏజ్ లో కనిపిస్తాడని అంటున్నారు. ఈ సినిమాలో ఆయన గెటప్ కూడా రియల్ గా ఉండబోతుందని తెలుస్తుంది. ఇప్పటికే బోయపాటి శ్రీను డైరక్షన్ లో వస్తున్న సినిమాలో బాలకృష్ణ రెండు పాత్రల్లో కనిపించనున్నాడు. అయితే ఈ సినిమాలో ఒక పాత్రలో అఘోరాగా నటిస్తున్నారట. బాలయ్య బాబు రియల్ లుక్ తో ఈ సినిమాలో కనిపిస్తారట. మొత్తానికి బాలకృష్ణ తండ్రి పాత్రలో అదరగొడతాడని అంటున్నారు.