
ఎఫ్-2 తో మళ్ళీ తిరిగి తన ఫామ్ లోకి వచ్చిన విక్టరీ వెంకటేష్ ఆ తర్వాత వచ్చిన వెంకీమామ సినిమాతో కూడా మంచి హిట్ అందుకున్నాడు. మేనళ్లుడు నాగ చైతన్యకు హిట్ ఇవ్వాలని అనుకున్న వెంకీ మామ అనుకున్నట్టుగానే ఆ సినిమాతో హిట్ ఇచ్చేశాడు. ప్రస్తుతం తమిళ సూపర్ హిట్ మూవీ అసురన్ రీమేక్ నారప్పలో నటిస్తున్న వెంకటేష్ ఆ సినిమా తర్వాత ఎఫ్-3లో నటిస్తాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమాతో పాటుగా వెంకటేష్ వెబ్ సీరీస్ ల మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తుంది.
తెలుగులో వెబ్ సీరీస్ ల హవా నడుస్తుంది. స్టార్స్ కూడా వెబ్ సీరీస్ ల మీద దృష్టి పెడుతున్నారు. ఇప్పటికే అల్లు అరవింద్ సొంతంగా ఆహా ఓటిటి ఏర్పాటుచేయగా నిర్మాత సురేష్ బాబు కూడా మరో ఓటిటి ఏర్పాటు చేస్తున్నట్టు టాక్. ఇక అందులో భాగంగా వెంకటేష్ తో ఒక క్రేజీ వెబ్ సీరీస్ ప్లాన్ చేస్తున్నారట అదే జరిగితే ఫ్యామిలీ ఆడియెన్స్ అందరు ఇక సినిమాలు చూడటం మానేస్తారు. వెంకటేష్ కు ఉన్న లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ క్యాష్ చేసుకునే పనిలో ఈ వెబ్ సీరీస్ ప్లాన్ వర్క్ అయ్యేలా ఉంది.