పాపం రకుల్ అలా బుక్ అయ్యింది..!

మన్మధుడు 2 తర్వాత తెలుగులో అవకాశాల్లేని రకుల్ ప్రీత్ సింగ్ తన మకాం ముంబైకి మార్చేసింది. ఇక లాక్ డౌన్ టైంలో బ్రదర్ తో ఆటలాడుటూ వీడియోని షేర్ చేసిన రకుల్ లేటెస్ట్ గా ఓ షాప్ నుండి బయటకు వస్తూ కనిపించిన వీడియో వైరల్ అవుతుంది. కరోనా వల్ల గత 40 రోజులుగా వైన్ షాపులు క్లోజ్ చేయగా నిన్నటినుండే ఓపెన్ చేశారు. ఇక ఈ టైం లో షాప్ నుండి బయటకు వస్తున్న రకుల్ వీడియో సోషల్ మీడియాలో పెట్టారు. 

రకుల్ కూడా వైన్ షాప్ నుండి వస్తుందని.. ఆమె చేతిలో కూడా వైన్ బాటిల్స్ ఉన్నాయని ట్రోల్స్ చేస్తున్నారు. అయితే అసలు విషయం ఏంటంటే రకుల్ వచ్చింది వైన్ షాప్ నుండి కాదు.. ఆమె చేతిలో ఉంది కూడా వైన్ బాటిల్స్ కాదని తెలుస్తుంది. తనపై వస్తున్న ఈ ట్రోల్స్ పై రకుల్ ఎలా స్పందిస్తుందో చూడాలి.