బన్నీని పొగిడి ఛాన్స్ పట్టేసిందా..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో ఐదు భాషల్లో రాబోతున్న క్రేజీ మూవీ పుష్ప. ఈ సినిమాతో తన బాలీవుడ్ ఎంట్రీ కల నెరవేర్చుకుంటున్నాడు అల్లు అర్జున్. ఇప్పటికే సథరన్ స్టార్ ఇమేజ్ సాధించిన బన్నీ బాలీవుడ్ లో కూడా తన పాగా వేయాలని ఫిక్స్ అయ్యాడు. అందుకే పుష్ప పాన్ ఇండియా అంటూ ఎనౌన్స్ చేసి షాక్ ఇచ్చాడు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న పుష్ప సినిమాలో బాలీవుడ్ భామ దిశా పటాని ఛాన్స్ పట్టేసిందని అంటున్నారు. 

బాలీవుడ్ లో రిలీజ్ అవుతుంది కాబట్టి స్పెషల్ సాంగ్ కోసం అయినా సరే అక్కడ హీరోయిన్ ను తీసుకుంటారు. ఆ లక్కీ ఛాన్స్ దిశా పటాని అందుకుంది తెలుస్తుంది. పూరి జగన్నాథ్ డైరక్షన్ లో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన లోఫర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది దిశా పటాని. ఆ సినిమా ప్లాప్ అవడంతో అడ్రెస్ లేకుండా పోయింది. అయితే అమ్మడికి ఈమధ్య బాలీవుడ్ లో సూపర్ క్రేజ్ వచ్చింది. ఓ పక్క బికినీ ఫోటో షూట్స్ తో కుర్రాళ్లకు నిద్ర పట్టకుండా చేస్తున్న ఈ భామ వరుస సినిమాలు హిట్లు కొడుతోంది. ఇక రీసెంట్ గా అల్లు అర్జున్ డ్యాన్స్ గురించి స్పెషల్ గా ప్రస్తావించింది దిశా. అలా బన్నీని పొగడటమే ఆమెకు పుష్పలో ఛాన్స్ వచ్చేలా చేసిందని అంటున్నారు. దిశా మాత్రమే కాదు పుష్పలో ఊర్వశి రౌతులా కూడా ఉందని వార్తలు వచ్చాయి. ఐతే అఫీషియల్ గా ఎనౌన్స్ చేస్తే తప్ప పుష్ప ఛాన్స్ ఎవరికీ దక్కిందో తెలియదు.