పునర్నవి ఎక్స్ ట్రా డోస్..!

బిగ్ బాస్ సీజన్ 3 లో హాట్ కంటెస్టంట్ అయిన పునర్నవి షోలో తన సోలో పర్ఫార్మెన్స్ కన్నా రాహుల్ తో రాసుకుపూసుకోవడాలే ఎక్కువయ్యాయి. బయటకు వచ్చాక కూడా వీరిద్దరు కలిసి కనబడ్డారు. ఇక వీరిద్దరు పెళ్లి చేసుకోవడం పక్కా అనుకునేసరికి తూచ్ మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్సే అంటూ ఎవరి దారి వారు చూసుకున్నారు. రాహుల్ తనకు వచ్చిన టైటిల్ క్రేజ్ తో షోలతో ఫుల్ బిజీ అయ్యాడు. పునర్నవి మాత్రం హీరోయిన్ గా ఒకటి రెండు అవకాశాలు సాధించిందని తెలుస్తుంది.

బిగ్ బాస్ తో వచ్చిన ఇమేజ్ ను ఇంకాస్త పెంచుకునేలా పునర్నవి ప్రయత్నాలు ఉన్నాయి. ముఖ్యంగా తనలోని హాట్ యాంగిల్ తో ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేయాలని చూస్తుంది పునర్నవి. అందుకే లేటెస్ట్ గా కాల్విన్ క్లెయిన్ ఇన్నర్ వేర్స్ తో దిగిన ఓ పిక్ ను షేర్ చేసింది. పున్ను చేసిన ఈ ఎక్స్ ట్రా డోస్ హాట్ షోకి ఆడియెన్స్ నుండి మిక్సెడ్ రెస్పాన్స్ వస్తుంది. బాలీవుడ్ లో దిశా పటాని కాల్విన్ క్లెయిన్ ను విపరీతంగా వాడేస్తూ అడ్డగోలుగా అందాల ప్రదర్శన చేస్తుంది. మరి పునర్నవికి ఆమె గాలి సోకిందా ఏమో గాని గ్లామర్ షోతో ఆకట్టుకుంటుంది. కథానాయికలు ఏం చేసినా అవకాశాల కోసమే.. మరి పునర్నవి చేస్తున్న ఈ హాట్ షో వల్ల అమ్మడికి మంచి అవకాశాలు వస్తాయో లేదో చూడాలి.