సెన్సార్ పోస్టర్ పై రిలీజ్ డేట్ లేదేంటో..!

సంక్రాంతి సినిమాల రిలీజ్ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదా.. బన్ని వర్సెస్ మహేష్ ఫైట్ కు డేట్స్ ఫిక్స్ కాలేదా అంటే ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అసలైతే మహేష్ సరిలేరు నీకెవ్వరు జనవరి 11న అల్లు అర్జున్ అల వైకుంఠపురములో 12న రిలీజ్ ప్లాన్ చేశారు. అయితే బన్ని సినిమా మళ్లీ ముందుకు తెచ్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.

అయితే అల్లు అర్జున్ సినిమా రిలీజ్ డేట్ క్లారిటీ రాలేదు కాబట్టి మహేష్ కూడా తన సినిమా పోస్టర్ పై రిలీజ్ డేట్ వేయట్లేదు. సెన్సార్ కంప్లీట్ చేసుకున్న సరిలేరు నీకెవ్వరు సినిమా యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. అయితే ఈ సెన్సార్ సర్టిఫికెట్ పోస్టర్ పై ర్లీజ్ డేట్ ఉంచలేదు. మరి రిలీజ్ మరో 8 రోజులు ఉండగా మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమా కన్ ఫ్యూజన్ ఏంటో తెలియాల్సి ఉంది.