సాయి పల్లవి వీడియో లీక్..!

ఫిదాతో ప్రేక్షకులను ఇంప్రెస్ చేసిన ప్రేమమ్ బ్యూటీ సాయి పల్లవి తెలుగులో సెలెక్టెడ్ సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం సాయి పల్లవి రానాతో విరాటపర్వం సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాతో పాటుగా శేఖర్ కమ్ముల డైరక్షన్ లో మరో సినిమా చేస్తుంది. విరాట పర్వం సినిమా షూటింగ్ టైంలో సాయి పల్లవి పిక్స్ కొన్ని లీక్ అయ్యాయి. అయితే లేటెస్ట్ గా శేఖర్ కమ్ముల సినిమాకు సంబందించిన షూటింగ్ వీడియో కూడా లీక్ అయినట్టు తెలుస్తుంది.

శేఖర్ కమ్ముల సినిమాలో నాగ చైతన్య హీరోగా నటిస్తున్నాడు. ఈ ఇయర్ మజిలీ, వెంకీమామ సినిమాలతో హిట్ అందుకున్న చైతు కెరియర్ లో మంచి జోష్ కనబరుస్తున్నాడు. ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల, సాయి పల్లవి కాంబోలో వస్తున్న ఈ సినిమాతో కూడా నాగ చైతన్య హిట్టు కొడతాడని అంటున్నారు. అయితే సాయి పల్లవి ఏ సినిమా చేస్తే ఆ సినిమా పిక్స్, వీడియోస్ లీక్ అవడంపై ఇండస్ట్రీలో చర్చ నడుస్తుంది.