
1980వ కాలం నాటి సిని స్టార్స్ అంతా క్లాస్ ఆఫ్ ఎయిటీస్ అంటూ ప్రతి సంవత్సరం పార్టీ జరుపుకుంటారు. ఈ ఇయర్ మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో క్లాస్ ఆఫ్ ఎయిటీస్ పార్టీ జరిగింది. తెలుగు, తమిళ, హింది, మళయాళ, కన్నడ భాషలకు సంబందించిన ఎయిటీస్ స్టార్స్ అంతా అటెండ్ అయ్యారు. అయితే ఈ పార్టీలో రాం చరణ్ కూడా పాల్గొన్నాడు. ఈ పార్టీలో పాల్గొన్న తర్వాత చరణ్ కు తన బ్యాచ్ తో ఇలాంటి పార్టీ ప్లాన్ చేయాలన్న ఆలోచన వచ్చిందట.
ప్రస్తుతం తెలుగులో ఉన్న స్టార్స్ తో పాటుగా తమిళ, హింది, కన్నడ, మళయాళ స్టార్స్ అందరితో కలిసి ఇలాంటి పార్టీ ఒకటి ప్లాన్ చేయాలనే ఆలోచనతో ఉన్నాడని తెలుస్తుంది. మన స్టార్స్ సినిమా ఈవెంట్స్ కు రావడమే కష్టం అలాంటిది ఇలాంటి పార్టీకి అటెండ్ అవుతారా అంటే దీన్ని ఓ సెంటిమెంట్ గా ముందుతరాలకు మంచి మెసేజ్ ఇచ్చేలా పార్టీ ప్లాన్ చేస్తున్నారట. మొత్తానికి చరణ్ ఐడియా బాగున్నా ఈ పార్టీ జరిగిన తర్వాత సక్సెస్ అయ్యిందని చెప్పగలం.