నా నిజమైన స్నేహితుడు కిట్టయ్య

కిరణ్, రహస్య గోరక్ హీరో హీరోయిన్లుగా రవికిరణ్ కోలా డైరెక్ట్ చేస్తున్న సినిమా రాజావారు రాణిగారు. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో క్రేజీ డైరక్టర్ సుకుమార్ పాల్గొన్నారు. ఈ సినిమాలో సుకుమార్ స్నేహితుడు కిట్టయ్య ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారట. అందుకే సుకుమార్ ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా వచ్చారు. మాములుగా భుజం మీద చెయ్యి వేసి వీడు నా స్నేహితుడు అని చెప్పే టైపు కాదు వీడు. నా కాలికి ముళ్లు దిగితే వాడి కళ్లల్లో నీళ్లు వస్తాయ్ అంత గొప్ప స్నేహితుడు కిట్టయ్య.

కిట్టయ్య కూలికి వెళ్లి వచ్చిన డబ్బులతో తనకు సినిమాలు చూపించే వాడని కిట్టయ్య తనకు ఎంత ఆత్మీయుడో చెప్పి ఎమోషనల్ అయ్యారు సుకుమార్. తన స్నేహితుడికి ఈ సినిమాలో పాత్ర ఇచ్చినందుకు చిత్రయూనిట్ కు ధన్యవాదాలు తెలిపారు సుకుమార్. నా నిజమైన స్నేహితుడు కిట్టయ్య అని చెప్పడం విశేషం. ఇక సినిమాల విషయానికి వస్తే సుకుమార్ అల్లు అర్జున్ కాంబోలో సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.