అమలా పాల్ లస్ట్ స్టోరీస్

మళయాళ పరిశ్రమ నుండి వచ్చిన అమలా పాల్ తమిళంలో హీరోయిన్ గా మంచి క్రేజ్ తెచ్చుకుంది. తెలుగులో చేసిన రెండు మూడు సినిమాలే అయినా ఇక్కడ కూడా అమ్మడికి ఫాలోయింగ్ ఉంది. డైరెక్టర్ విజయ్ ను పెళ్లాడటం డైవర్స్ తీసుకోవడం అంతా తెలిసిందే.  అయితే ఇప్పడు మళ్ళీ సినిమా లతో బిజీ అవ్వాలని చూస్తుంది అమలా పాల్. 

రీసెంట్ గా తెలుగు,  తమిళ భాషల్లో ఆడై అంటూ ఒక ప్రయత్నం చేసిన పెద్దగా ఫలితం దక్కలేదు.  ఆ సినిమా కోసం న్యూడ్ గా కూడా నటించింది అమలా పాల్. ఇక లేటెస్ట్ గా అమలా పాల్ లస్ట్ స్టోరీస్ వెబ్ సీరీస్ కు ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. బాలీవుడ్ లో లస్ట్ స్టోరీస్ వెబ్ సీరీస్ ఎంత పెద్ద హిట్ అయ్యాయన్నది తెలిసిందే అందుకే సౌత్ లో ఆ ఛాన్స్ దక్కించుకుంది అమలా పాల్..  ఈ వెబ్ సీరీస్ ను నెట్ ఫ్లిక్స్ వారు నిర్మిస్తున్నారు. మరి అమలా పాల్ హాట్ అవతార్ ఎలా ఉండబోతుందో చూడాలి.