
బిగ్ బాస్ సీజన్ 3, 75 రోజులు పూర్తి చేసుకుంది. కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న ఈ షోలో ప్రతి వారం నామినేషన్స్ ఉంటాయని తెలిసిందే. ఈ వారం నామినేషన్స్ లో మహేష్, వరుణ్, రాహుల్, పునర్నవి ఉన్నారు. అయితే అందరి కంటే తక్కువ ఓట్స్ తో మహేష్ ఇంటి నుండి బయటకు వచ్చేసినట్టు తెలుస్తుంది. అసలైతే షో టెలికాస్ట్ అయ్యేంతవరకు ఎవరు ఎలిమినేట్ అయ్యేది తెలియదు కాని అన్నపూర్ణ స్టూడియోలోనే బిగ్ బాస్ సెట్ వేయడం వల్ల లీకులు కామన్ అయ్యాయి.
మొదట్లో ఈ లీకులు ఆపేయాలని బిగ్ బాస్ నిర్వాహకులు ప్రయత్నించినా వారి వల్ల కాలేదు. ఇదిలాఉంటే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యేది ఆల్రెడీ లీక్ అయ్యింది. మహేష్ విట్ట ఈ వారం ఎలిమినేట్ అయ్యారని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తెలుగు వన్ యూట్యూబ్ ఛానెల్ ఫన్ బకెట్ తో ఫేమస్ అయిన మహేష్ ఆ తర్వాత సినిమాల్లో కూడా ఛాన్స్ దక్కించుకున్నాడు. ఈ వారం నామినేషన్స్ లో ఉన్న మహేష్ ఫైనల్ గా హౌజ్ నుండి బయటకు వచ్చాడని తెలుస్తుంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో సండే ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది.