
పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా అనీల్ డైరక్షన్ లో వస్తున్న సినిమా రొమాంటిక్. పూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో ఆకాష్ పూరి సరసన కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. తన డబ్ స్మాష్ తో ఫాలోవర్స్ ను పెంచుకున్న కెతిక శర్మ ఫోటో షూట్స్ తో కూడా ఆకట్టుకుంటుంది. ఆకాష్ తో రొమాంటిక్ సినిమాలో నటిస్తున్న ఈ అమ్మడు తెలుగులో లక్కీ ఛాన్స్ కొట్టిందని చెప్పొచ్చు.
ఈ సినిమా నుండి లేటెస్ట్ గా వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ మాటల్లేకుండా చేసింది. అదేంటి అనుకుంటున్నారు కదా.. పైన పోస్టర్ చూస్తే మీకు అలాంటి ఫీలింగే కలుగుతుంది. హీరో, హీరోయి ప్రేమ తన్మయత్వంతో బిగి కౌగిలిలో ఉన్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే హీరోయిన్ హాఫ్ న్యూడ్ గా ఉండటమే.. కుర్రాడు స్లీవ్ లెస్ టీ షర్ట్ తో కనిపిస్తున్నాడు. కాని హీరోయిన్ మాత్రం సెమీ న్యూడ్ గా హత్తుకుంది. మరి పోస్టర్ కిక్ ఇచ్చేలా ఉండగా ఫస్ట్ లుక్ పోస్టర్ తో సినిమాపై క్రేజ్ పెంచేశాడు పూరి. అసలే ఇస్మార్ట్ హిట్ తో జోష్ మీద ఉన్న పూరి రొమాంటిక్ మూవీని అదే రొమాంటిక్ అప్పీల్ తో నిర్మిస్తున్నాడని తెలుస్తుంది.