అమ్మడికి అంత సీన్ ఉందా..?

తెలుగులో మెంటల్ మదిలో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన తమిళ హీరోయిన్ నివేదా పేతురాజ్ ఈ ఇయర్ బ్రోచేవారెవరురా.. చిత్రలహరి సినిమాలతో హిట్ అందుకుంది. అందం అభినయం రెండు ఉన్న ఈ అమ్మడికి ఆఫర్లు కూడా బాగానే వస్తున్నాయట. అయితే తన దగ్గరకు వచ్చిన దర్శక నిర్మాతలకు రెమ్యునరేషన్ భారీగా అడిగి షాక్ ఇస్తుందట నివేదా పేతురాజ్. అమ్మడు 20 రోజుల డేట్స్ కోసం 70 లక్షల దాకా అడుగుతుందని తెలుస్తుంది.

మరో 30 లక్షలు ఇస్తే పూజా హెగ్దె, రష్మిక మందన్న లాంటి క్రేజీ హీరోయిన్స్ వచ్చే అవకాశం ఉంది. తనకంటూ వచ్చిన ఆఫర్లు ఇలా రెమ్యునరేషం భారీగా అడిగి చేజార్చుకుంటుంది నివేదా పేతురాజ్. ఆల్రెడీ ఇలానే విజయ్ దేవరకొండ క్రాంతి మాధవ్ సినిమా ఛాన్స్ మిస్ చేసుకున్న నివేదా రవితేజ డిస్కో రాజా ఛాన్స్ కూడా పారితోషికం కుదరకనే వదులుకుందట. మరి వచ్చిన ఆఫర్లు ఇలా చేజార్చుకుంటే కష్టమే అంటున్నారు సిని విశ్లేషకులు.