
మెగా డాటర్ నిహారిక హీరోయిన్ గా సక్సెస్ అవలేదు. మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన ఏకైక హీరోయిన్ నిహారిక కొణిదెల. ఒక మనసు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక చివరగా హ్యాపీ వెడ్డింగ్ సినిమాతో వచ్చింది. అయితే ఆ సినిమా కూడా పెద్దగా వర్క్ అవుట్ కాకపోవడంతో నిహారిక డీలా పడ్డది. స్టార్ ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోయిన్ కాబట్టి ఇన్నాళ్లు గ్లామర్ షోకి దూరంగా ఉంది.
నిహారిక కూడా గ్లామర్ గా కనిపించాలని అనుకుంది కాబోలు లేటెస్ట్ గా వైజాగ్ బీచ్ లో వైట్ షర్ట్ తో కింద ప్యాంట్ వేసుకోకుండా స్టిల్ ఇచ్చింది అమ్మడు. బీచ్ లో సరదాగా గడిపిన రోజు కంటే బెస్ట్ మరొకటి లేదు అంటూ అమ్మ తీసిన ఫోటోని షేర్ చేస్తూ క్యాప్షన్ కూడా ఇచ్చింది నిహారిక. ప్రస్తుతం సినిమాల మీద కన్నా ఫోకస్ మొత్తం వెబ్ సీరీస్ ల మీదే ఉందని తెలుస్తుంది. త్వరలో ఓ వెబ్ సీరీస్ తో ఆమె రాబోతుందట.