క్రికెటర్ కావాల్సిన రానా.. హీరో అయ్యాడు..!

దగ్గుబాటి రానా గురించి ఓ సెన్సేషనల్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దగ్గుబాటి వారసుడిగా రానాని అసలు హీరోని చేద్దామని అనుకోలేదట సురేష్ బాబు. తనయుడిని క్రికెటర్ చేయాలని అనుకున్నాడట. కాని అది కుదరక హీరోని చేశాడన్నారు. అయితే క్రికెటర్ చేయకపోడానికి కారణం ఏంటంటే రానాకి ఓ కన్ను సరిగా కనబడదట. చిన్నప్పుడే రానాకి ఓ కన్ను సమస్య ఉండేదట. ఆ తర్వాత కన్ను మార్చేశారట.

అయినా సరే అతను కన్ను సరిగా కనిపించదని చెప్పుకొచ్చారు సురేష్ బాబు. క్రికెట్, ఆర్చరీ ఆడుతున్న టైంలో ఇబ్బంది ఎదురవగా హాస్పిటల్ లో టెస్ట్ చేయిస్తే కంటి సమస్య గురించి తెలిసిందని.. అందుకే రానా స్పోర్ట్స్ కెరియర్ నుండి డ్రాప్ అయ్యాడని చెప్పుకొచ్చారు. క్రికెటర్ అంటే సురేష్ బాబుకి చాలా ఇష్టమట. ఇప్పటికి తాను క్రికెట్ ఆడుతుంటానని అన్నారు.