
సూపర్ స్టార్ రజినికాంత్ హీరోగా ఏ.ఆర్. మురుగదాస్ డైరక్షన్ లో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబందించి ఓ లీక్డ్ ఫోటో మొన్నామధ్య సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇక ఇప్పుడు చిత్రయూనిట్ అఫిషియల్ గా రజిని లుక్ రివీల్ చేశారు. అంతేకాదు ఈ సినిమా టైటిల్ గా దర్భార్ అని ఫిక్స్ చేశారు.
పేట తర్వాత రజిని చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అంతేకాదు అవార్డ్ విన్నర్ డైరక్టర్ మురుగదాస్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. సినిమాలో టైటిల్ తో పాటుగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ లో రజిని స్టైల్ అదిరింది. ఇక సినిమాలో రజిని పోలీస్ గా కనిపిస్తాడని తెలుస్తుంది. ఫైనల్ గా దర్భార్ గా తలైవా తన సత్తా చాటాలని చూస్తున్నాడు. త్వరలో ముంబై షెడ్యూల్ మొదలు పెట్టనున్న ఈ సినిమాలో నయనతార, కీర్తి సురేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.