
సందీప్ వంగ డైరక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన సినిమా అర్జున్ రెడ్డి. విజయ్ కు యూత్ లో ఫాలోయింగ్ తో పాటుగా స్టార్డం తెచ్చిన సినిమా అది. ఇక ఇప్పుడు ఆ సినిమా బాలీవుడ్ లో రీమేక్ అవుతుంది. హింది వర్షన్ కు సందీప్ వంగనే డైరెక్ట్ చేస్తున్నాడు. బాలీవుడ్ అర్జున్ రెడ్డికి కబీర్ సింగ్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాకు సంబందించిన టీజర్ ఈరోజు రిలీజ్ చేశారు.
డైరక్టర్ ఒకడే కాబట్టి అర్జున్ రెడ్డి ఫీల్ ఏమాత్రం పోకుండా కబీర్ సింగ్ తెరకెక్కిస్తున్నాడని టీజర్ చూస్తేనే అర్ధమవుతుంది. కబీర్ సింగ్ లో హీరోగా షాహిద్ కపూర్ నటిస్తున్నాడు. విజయ్ కన్నా సీనియర్ యాక్టర్ కాబట్టి షాహిద్ కూడా కబీర్ సింగ్ పాత్రలో అదరగొట్టేశాడు. తెలుగులో షాలిని పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ లో కియరా అద్వాని హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. జూన్ 21న ఈ సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు. మరి బాలీవుడ్ లో అర్జున్ రెడ్డి అదేనండి కబీర్ సింగ్ హంగామా ఎలా ఉంటుందో చూడాలి.