చిత్రలహరికి క్లీన్ సర్టిఫికెట్..!

మెగా హీరో సాయి తేజ్ ఈసారి చిత్రలహరితో హిట్ కొట్టడానికి సిద్ధమయ్యాడు. కిశోర్ తిరుమల డైరక్షన్ లో వస్తున్న సినిమా చిత్రలహరి. కళ్యాణి ప్రియదర్శి, నివేదా పేతురాజ్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. ఏప్రిల్ 12న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఈరోజు సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంది. మెగా హీరోల్లో అతి తక్కువ టైంలోనే మాస్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న తేజ్ చిత్రలహరి సినిమాకు క్లీన్ 'U' సర్టిఫికెట్ అందుకోవడం విశేషం.     

సాయి తేజ్ లాంటి హీరో సినిమాకు 'U' సర్టిఫికెట్ అంటే మెగా ఫ్యాన్స్ కాస్త కంగారు పడే అవకాశం ఉన్నా కిశోర్ తిరుమల ఇంతకుముందు సినిమాల్లానే ఈ సినిమా కూడా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వస్తున్నా పరిధి దాటి వెళ్లలేదని తెలుస్తుంది. రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ కూడా సినిమాపై అంచనాలు పెంచింది. సో మొత్తానికి చిత్రలహరి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తుంది మరి సాయి తేజ్ హిట్టు కల ఈ సినిమా అయినా నెరవేరుస్తుందో లేదో చూడాలి.