అల్లు అర్జున్ ను 'ఐకాన్' చేస్తున్న దిల్ రాజు

నా పేరు సూర్య తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రంతో ఓ సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. ఆ తర్వాత సుకుమార్ సినిమా కూడా లైన్ లో ఉంది. అయితే ఈరోజు బర్త్ డే సందర్భంగా అల్లు అర్జున్ తో దిల్ రాజు 4వ సినిమా ఎనౌన్స్ చేశాడు. వేణు శ్రీరాం డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు ఐకాన్ అని ఫిక్స్ చేశారు. ఓ మై ఫ్రెండ్, ఎం.సి.ఏ సినిమాలను డైరెక్ట్ చేసిన వేణు శ్రీరాం బన్నితో భారీ మూవీని సెట్ చేసుకున్నాడు. ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ లో మరో విశేషం ఏంటంటే స్టైలిష్ స్టార్ అల్లు అరున్ ని కాస్త సథరన్ స్టార్ చేశారు.

అంటే ఈ సినిమా కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. అల్లు అర్జున్ తో ఆర్య, పరుగు, డిజే సినిమాలు చేసిన దిల్ రాజు ఐకాన్ గా అల్లు అర్జున్ తో ఎలాంటి సినిమా చేస్తున్నాడో చూడాలి. ఐకాన్ ట్యాగ్ లైన్ గా కనబడుట లేదు అన్నది ఇంట్రెస్టింగ్ గా ఉంది. మరి అల్లు అర్జున్ ను ఐకాన్ చేస్తున్న దిల్ రాజు ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.