
కన్నడ బ్యూటీ రష్మిక మందన్న తెలుగులో వరుస స్టార్ అవకాశాలను అందుకుంటుంది. ఛలో, గీతా గోవిందం, దేవదాస్ సినిమాలు చేసిన రష్మిక త్వరలో డియర్ కామ్రేడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న ఈ సినిమాను భరత్ కమ్మ డైరక్షన్ లో వస్తుంది. ఇక ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలో కూడా రష్మిక ఛాన్స్ దక్కించుకుందని తెలుస్తుంది. నా పేరు సూర్య తర్వాత అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రంతో సినిమాకు రెడీ అవుతున్నాడు.
అల్లు అర్జున్ 20వ సినిమా సుకుమార్ డైరక్షన్ లో తెరకెక్కనుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక నటిస్తుందని తెలుస్తుంది. ఇప్పటికే నితిన్ భీష్మ సినిమాలో కూడా నటిస్తున్న రష్మిక చూస్తుంటే తెలుగులో స్టార్ హీరోయిన్ గా అదరగొట్టడం ఖాయమని తెలుస్తుంది. సూపర్ స్టార్ మహేష్ అనీల్ రావిపుడి డైరక్షన్ లో సినిమాకు రష్మిక హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యిందని అంటున్నారు. అదే జరిగితే ఇక అమ్మడి కెరియర్ కు తిరుగు ఉండదని చెప్పొచ్చు.