
మల్టీస్టారర్ ట్రెండ్ కొనసాగుతున్న టాలీవుడ్ లో మరో క్రేజీ మల్టీస్టారర్ మూవీ వస్తుంది. విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా వస్తుంది. జై లవ కుశ తర్వాత బాబి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా నుండి టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. కొన్నాళ్లుగా వినిపిస్తున్న వెంకీమామ సినిమానే టైటిల్ గా పెట్టి ఉగాదికి ఓ రోజు ముందే వెంకీమామ టైటిల్ పోస్టర్ వదిలారు.
నాగ చైతన్య నటించిన ప్రేమం సినిమాలో వెంకటేష్ ఓ చిన్న కెమియో రోల్ చేశాడు. ఇప్పుడు ఇద్దరు కలిసి ఫుల్ లెంగ్త్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పోస్టర్ చక్రంలో వెంకీమామ అని రాసి ఉంది. వెంకీ అన్నది ఇంగ్లీష్ లో రాసి ఉంటే.. మామ మాత్రం తెలుగులో పెట్టారు. ఇక టైటిల్ పక్కన రైట్ సైడ్ లో ఆర్మీ వాతావరణం కనిపిస్తుండగా ఎడమ పక్క మాత్రం ఓ విలేజ్ సెట్ ఉంది. మొత్తానికి వెంకీమామ టైటిల్ పోస్టర్ అలరించింది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఈ సినిమాలో రాశి ఖన్నా, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.