
అల్లుడు శీను సినిమా నుండి కవచం వరకు హీరోగా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ వస్తున్న డిస్ట్రిబ్యూటర్ కమ్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం తేజ డైరక్షన్ లో సీత సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ కూడా ఐటం సాంగ్ చేసింది. ఇక ఈ సినిమా పూర్తి కాకుండానే తమిళ సూపర్ హిట్ రీమేక్ సెట్స్ మీదకు తీసుకెళ్లాడు బెల్లంకొండ బాబు.
కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ రాక్షసన్ కు రీమేక్ గా రమేష్ వర్మ డైరక్షన్ లో బెల్లంకొండ హీరో ఈ సినిమా చేస్తున్నడు. ఈ సినిమాకు టైటిల్ గా రాక్షసుడు అని పెట్టారట. ఆల్రెడీ సగానికి పైగా షూటింగ్ పూర్తయినట్టు తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ అయిన రాక్షసుడిని మళ్లీ తన సినిమాకు పెట్టుకున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. సీత టీజర్ ఇంప్రెస్ చేయగా సినిమా కూడా హిట్ కొట్టేలా ఉంది. మరి ఆ సినిమా తర్వాత వచ్చే రాక్షసుడు ఎలా ఉంటాడో చూడాలి.