
సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ తో చేసిన హంగామా అందరికి తెలిసిందే. ఎలాగోలా అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యేలా చేసిన ఆర్జివి తన తర్వత సినిమా అప్డేట్ తో అందరికి షాక్ ఇచ్చాడు. వర్మ తన నెక్స్ట్ సినిమాగా శశికళని ఎంచుకున్నాడు. జయలలిత స్నేహితురాలైన శశికళ జీవితం మీద వర్మ సినిమా చేస్తున్నాడు. శశికళ సినిమా పోస్టర్ కూడా వదిలిన ఆర్జివి అందులో రియల్ ఇమేజెస్ వాడటం జరిగింది.
శశికళ క్యాప్షన్ గా లవ్ ఈజ్ డేంజరస్ పొలిటికల్ అని పెట్టాడు. సినిమా ప్రకటిస్తున్నందుకు సంతోషంగా ఉందన్న వర్మ త్వరలోనే మరిన్ని డీటైల్స్ తో మీ ముందుకు వస్తానని ట్వీట్ చేశాడు. దయలేని మనుషులు, జైళ్లకు మన్నార్ గుడి గ్యాంగ్ మధ్య నడిచే కథ ఇదని పోస్టర్ మీద రాసుకొచ్చాడు. మరి వర్మ చేస్తున్న ఈ శశికళ ఇంకెన్ని వివాదాలు సృష్టిస్తుందో చూడాలి.