
ఎన్.టి.ఆర్ అసలు కథ తాను చెబుతానని చెప్పిన ఆర్జివి రిలీజ్ కు ఎలాంటి అడ్డంకులు లేవని ధీమాగా ఉన్నాడు. తెల్లారితే సినిమా రిలీజ్ అవుతుందని అందరు భావించగా అనూహ్యంగా మంగళగిరి కోర్ట్ ఈ సినిమా విడువలపై స్టే ఇచ్చింది. సినిమా విడుదలతో తమ మనోభావాలు దెబ్బతింటాయని ఏపి హైకోర్ట్ లో పిటీషన్ వేశారు. పిటీషన్ పరిశీలించిన హైకోర్ట్ ఏప్రిల్ 3 న స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
అయితే తెలంగాణాలో ఈ సినిమాకు ఎలాంటి అడ్డంకులు లేవు.. ఎన్నికల కమీషన్, తెలంగాణా హైకోర్ట్ కూడా లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ విడుదలపై ఎలాంటి ఆంక్షలు విధించలేదు. ఏపిలో రిలీజ్ అడ్డుకుంటున్న తీరుపై ఆర్జివి ఎలా రియాక్ట్ అవుతాడు అన్నది చూడాలి. ఈరోజు వరకు సైలెంట్ గా ఉండి కరెక్ట్ టైం లో దెబ్బకొట్టారని అనుకుంటున్నారు. మరి వర్మ తీసుకునే నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుందో చూడాలి.