
మిల్కీ బ్యూటీ తమన్నాతో డేటింగ్ చేయాలనుకునే వారు ఉండొచ్చు. అఫ్కోర్స్ ఇంతవరకు అమ్మడికి డేటింగ్ ఆఫర్స్ వచ్చాయో లేదో తెలియదు కాని తను మాత్రం ఛాన్స్ వస్తే ఓ హీరోతో డేటింగ్ కు వెళ్లేందుకు సిద్ధమని చెబుతుంది తమన్నా. దశాబ్ధ కాలంగా సౌత్ హీరోయిన్ గా కెరియర్ సాగిస్తున్న తమన్నా ఈమధ్య కాస్త కెరియర్ వెనక్కి తగ్గినట్టు అనిపించినా మళ్లీ ఇప్పుడు వరుస ఛాన్సుకు అందుకుంటుంది.
ప్రస్తుతం దేవి-2, దటీజ్ మహాలక్ష్మి, సైరా నరసింహా రెడ్డి సినిమాల్లో నటిస్తున్న తమన్నా ఉరి సినిమాలో హీరోగా నటించిన విక్కి కౌశల్ తో తాను డేటింగ్ కు సిద్ధమని అంటుంది. సంజు సినిమాలోనే రణ్ బీర్ స్నేహితుడిగా నటించిన విక్కి కౌశల్ ఉరితో అందరిని ఆకట్టుకున్నాడు. మరి మిల్కీ ఆఫర్ ను విక్కి కౌశల్ ఎలాంటి రెస్పాన్స్ ఇస్తాడో చూడాలి.