
సూపర్ స్టార్ మహేష్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో భరీ అంచనాలతో వస్తున్న సినిమా మహర్షి. దిల్ రాజు, అశ్వనిదత్, పివిపి ముగ్గురు బడా నిర్మాతలు ఈ సినిమా లో మహేష్ సరసన పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో అల్లరి నరేష్ కూడా ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడని తెలిసిందే. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలోని మొదటి సాంగ్ ఈ శుక్రవారం ఉదయం 9:09 నిమిషాలకు రిలీజ్ చేస్తారట.
ఈ విషయాన్ని వెళ్లడిస్తూ సినిమా నుండి ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేశాడు వంశీ పైడిపల్లి. మహేష్, పూజా, నరేష్ కలిసి ఉన్న ఈ పోస్టర్ తో పాటుగా మహేష్ తో ఫ్రెండ్ షిప్ సెలబ్రేషన్స్ జరుపుకునేందుకు సిద్ధం కండి అంటూ ట్వీట్ చేశాడు. మే 9న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమాపై మహేష్ పూర్తి నమ్మకంగా ఉన్నాడు. భరత్ అనే నేను తర్వాత మహేష్ చేస్తున్న మహర్షి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఆ అంచనాలకు తగినట్టుగా ఉంటుందో లేదో చూడాలి.