మెగా ఈవెంట్ కు ఎన్టీఆర్..!

ఓ పక్క ఏపి ఎలక్షన్స్ లో టిడిపి, జనసేన పార్టీలు పోటీ పడుతుండగా మరోపక్క సిని తారలు మాత్రం ఇవేవి పట్టనట్టుగా తమ స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా మెగా నందమూరి మైత్రి కొత్త ట్రెండ్ సృష్టిస్తుంది. రాం చరణ్, ఎన్.టి.ఆర్ ల స్నేహం స్టార్ హీరోలకే కాదు మెగా నందమూరి ఫ్యాన్స్ కు కనువిప్పు కలిగిస్తుంది. పొలిటికల్ గా ఎలా ఉన్నా మాకేం సంబంధం లేదు అనేలా చరణ్, ఎన్.టి.ఆర్ ల స్నేహం కనిపిస్తుంది.

ఇదిలాఉంటే ఇప్పుడు మరో మెగా హీరోకి ఎన్.టి.ఆర్ తన సపోర్ట్ అందిస్తున్నారు. మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ హీరోగా కిశోర్ తిరుమల డైరక్షన్ లో వస్తున్న సినిమా చిత్రలహరి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 12న రిలీజ్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ కు గెస్ట్ గా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ అటెండ్ అవుతాడని తెలుస్తుంది. సాధారణంగా మెగా హీరోల ఈవెంట్స్ కు మెగాస్టార్ చిరంజీవి, రాం చరణ్ లాంటి వారు వస్తారు కాని మొదటిసారి మెగా ఈవెంట్ కు ఎన్.టి.ఆర్ గెస్ట్ గా వస్తున్నాడు. తేజ్, తారక్ కూడా క్లోక్ గా ఉంటారు. ఆ సాన్నిహిత్యం కొద్ది ఈ మెగా వేడుకకు తారక్ వస్తున్నాడని తెలుస్తుంది.