
సిని నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథతో ఓ సినిమా తెరకెక్కుతుంది. ఏ.ఎల్.విజయ్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నారు. ఈ సినిమాలో జయలలిత పాత్రని బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ని సెలెక్ట్ చేశారట. ఈ సినిమా కోసం కంగనా 25 కోట్ల దాకా డిమాండ్ చేసిందని తెలుస్తుంది. కంగనా అడిగిన పారితోషికం ఇచ్చేందుకు నిర్మాతలు ఓకే అన్నారట.
ఈ సినిమా తెలుగు, తమిళ, హింది భాషల్లో రిలీజ్ చేయనున్నారు. తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమాకు తలైవి టైటిల్ ఫిక్స్ చేయగా.. హిందీలో జయ అనే టైటిల్ ఫిక్స్ చేశారట. కాస్టింగ్ కోసమే ఇంత పెడుతున్నారు అంటే కచ్చితంగా సినిమా బడ్జెట్ కూడా భారీ రేంజ్ లో ఉంటుందని చెప్పొచ్చు. మరి తలైవి కథ ఎక్కడ మొదలై ఎక్కడ ఎండ్ అవుతుంది అన్నది చూడాలి.