నిహారిక సూర్యకాంతం ట్రైలర్..!

మెగా డాటర్ నిహరిక టైటిల్ రోల్ తో ప్రణీత్ బ్రహ్మాండపల్లి డైరక్షన్ లో వస్తున్న సినిమా సూర్యకాంతం. వరుణ్ తేజ్ సమర్పణలో నిర్వాణ సినిమాస్ బ్యానర్ లో సందీప్ ఎర్రంరెడ్డి, సృజన్ యరబోలు, రామ్ నరేష్ నిర్మించారు. మార్చి 29న రిలీజ్ అవుతున్న సూర్యకాంతం ట్రైలర్ కొద్ది గంటల క్రితం రిలీజైంది. అభి లైఫ్ లోకి డేరింగ్ అండ్ డ్యాషింగ్ సూర్యకాంతం ఎంటరవడం అతన్ని ఇష్టపడటం.. ఓ పక్క పూజా అనే అమ్మాయి కూడా అభిని ఇష్టపడతాడు.   

ఫైనల్ గా అభి సూర్యకాంతం ఎలా దగ్గరవుతారు అన్నది సినిమా కథ. సూర్యకాంతంలో నిహారిక తన నటనతో ఇంప్రెస్ చేస్తుందని ట్రైలర్ చూస్తేనే చెప్పొచ్చు. టీజర్ తో సినిమాపై అంచనాలు పెంచగా ట్రైలర్ మరింత ఆసక్తిగా ఉంది. ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై నిహారిక చాలా హోప్స్ పెట్టుకుంది. ముందు చేసిన రెండు సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. మరి ఈ సూర్యకాంతం అయినా నిహారికకు హిట్ ఇస్తుందో లేదో చూడాలి.