మన్మథుడు-2 మొదలుపెట్టారు

కింగ్ నాగార్జున సూపర్ హిట్ మూవీ మన్మథుడు సినిమాకు సీక్వల్ గా మన్మథుడు-2 మొదలైంది. చిలసౌ సినిమాతో ప్రతిభ చాటుకున్న రాహుల్ రవింద్రన్ డైరక్షన్ లో మన్మథుడు సీక్వల్ మొదలైంది. అయితే మన్మథుడు 2 మొదటి సినిమాకు సీక్వల్ గానే వస్తున్నా ఆ కథకు ఈ కథకు అసలు సంబంధం ఉండదట. అన్నపూర్ణ బ్యానర్ లో నాగార్జున నిర్మిస్తున్న ఈ సినిమాకు జెమిని కిరణ్ సమర్పకులుగా ఉంటున్నారు.  

నాగ్ సరసన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఆల్రెడీ నాగ చైతన్యతో కలిసి నటించిన రకుల్ ఇప్పుడు నాగార్జునతో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. ఏయన్నార్, నాగార్జున కలిసి శ్రీదేవితో ఆడిపాడినట్టు ఇప్పుడు చైతు, నాగ్ లతో రకుల్ ఛాన్స్ కొట్టేసింది. కాజల్ కూడా చిరు, చరణ్ లతో కలిసి నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో పాటుగా సోగ్గాడే చిన్ని నాయనా సీక్వల్ గా బంగార్రాజు సినిమాను కూడా సెట్స్ మీదకు తీసుకెళ్లబోతున్నాడు నాగార్జున.