
రాజమౌళి డైరక్షన్ లో 400 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాలో ఎన్.టి.ఆర్, రాం చరణ్ లతో పాటుగా అజయ్ దేవగన్ కూడా నటిస్తున్నాడని తెలిసిందే. అల్లూరి సీతారామరాజుగా రాం చరణ్, కొమరం భీం పాత్రలో ఎన్.టి.ఆర్ ఇలా ఇద్దరు రియల్ హీరోస్ పాత్రల్లో మన స్టార్స్ నటిస్తున్నారు. అయితే సినిమాలో అజయ్ దేవగన్ రోల్ కూడా అద్భుతంగా ఉంటుందట.
ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే పాత్ర అని రాజమౌళి ఆల్రెడీ చెప్పాడు. అయితే స్క్రిప్ట్ దశలోనే ఈ పాత్ర బాగా వచ్చిందట. అంతేకాదు చివరి అరగంటలో అజయ్ దేవగన్ పాత్రకు చాలా స్కోప్ ఉంటుందట. ప్రీ క్లైమాక్స్ లో సినిమాను అజయ్ దేవగన్ అదరగొట్టేస్తాడని అంటున్నారు. అలియా భట్, డైసీ ఎడ్గర్ జోన్స్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా 2020 జూలై 30న రిలీజ్ చేస్తారని ఎనౌన్స్ చేశారు.