కంగారు పడొద్దు నాకేం కాలేదు : సునీల్

తమ వ్యూస్ కోసం సెలబ్రిటీస్ జీవితాలతో ఆడుకోవడం సోషల్ మీడియాకు ఒక అలవాటుగా మారింది. రోడ్డు ప్రమాదంలో నటుడు మృతి అని పెట్టి ఆ నటుడి పేరు టాలీవుడ్ సెలబ్రిటీస్ లో ఒకరి పేరు పెట్టి వ్యూస్ తెచ్చుకుంటున్నారు. ఇది చాలా దారుణమైన పని.. లేటెస్ట్ గా హీరో కమ్ కమెడియన్ సునీల్కు ఇలాంటి షాక్ తగిలింది. సునీల్ కారుకి యాక్సి డెంట్.. కారు నుజ్జు నుజ్జై.. సునీల్ కూడా మృతి చెందినట్టుగా వార్తలు రాశారు. 

     

ఈ వార్తలు సునీల్ దాకా వెళ్లడంతో షాక్ అయ్యాడు. కేవలం మీ వ్యూస్ కోసం ఇలాంటి దారుణమైన వార్తలెలా రాస్తారు అంటూ ఫైర్ అయ్యాడు. ఇక తన అభిమానులకు వెల్ విషర్స్ కు తనకు ఏమి కాలేదని ఇది కావాలని వ్యూస్ కోసం సోషల్ మీడియా వాళ్లే సృష్టించారని క్లారిటీ ఇచ్చాడు. హీరోగా నెగ్గుకు రావడం కష్టమే అని భావించిన సునీల్ మళ్లీ కమెడియన్ గా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం సునీల్ రెండు మూడు సినిమాల్లో కమెడియన్ గా నటిస్తున్నాడు.