అర్జున్ రెడ్డి కాంబో రిపీట్..!

విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ వంగ డైరక్షన్ లో వచ్చిన సినిమా అర్జున్ రెడ్డి. విజయ్ సరసన షాలిని పాండే నటించిన ఈ సినిమా తర్వాత అమ్మడికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈమధ్య చాలా సినిమాల్లో షాలిని పాండే కనిపిస్తుంది. అయితే లీడ్ హీరోయిన్ గా మాత్రం ఆమెకు అవకాశాలు రావట్లేదు. అందుకే మళ్లీ విజయ్ దేవరకొండానే ఆ ఛాన్స్ ఇస్తున్నాడు. ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమా చేస్తున్న విజయ్ దేవరకొండ త్వరలో తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై డైరక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడని తెలిసిందే.  

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బైక్ రేసర్ గా కనిపిస్తాడట. అయితే ఈ మూవీలో విజయ్ కు జోడీగా షాలిని పాండే నటిస్తుందని తెలుస్తుంది. విజయ్, షాలిని కలిసి చేసిన అర్జున్ రెడ్డి అదరగొట్టగా ఆ సినిమా రేంజ్ లో ఈ మూవీ కూడా ఉంటుందని ఆశిస్తున్నారు రౌడీ హీరో ఫ్యాన్స్. తెలుగు, తమిళ భషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ బైక్ రేసింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు.