
నాచురల్ స్టార్ నాని హీరోగా గౌతం తిన్ననూరి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా జెర్సీ. నాని మిడిల్ ఏజ్ పాత్రలో కనిపిస్తున్న ఈ సినిమాలో క్రికెటర్ గా కనిపిస్తున్నాడు. రీసెంట్ గా రిలీజైన ఈ మూవీ టీజర్ ఇంప్రెస్ చేసింది. నాని సరసన శ్రద్ధ శ్రీనాథ్ నటిస్తున్న ఈ సినిమా నుండి రీసెంట్ గా మొదటి సాంగ్ రిలీజై ఆకట్టుకోగా ఈ సినిమా నుండి సెకండ్ సాంగ్ వచ్చింది.
స్పిరిట్ ఆఫ్ జెర్సీగా వచ్చిన ఈ సాంగ్ ను కృష్ణ కాంత్ రచించిన ఈ సాంగ్ కు అనిరుధ్ రవిచంద్రన్ అద్భుతమైన సంగీతం అందించారు. కాల భైరవ పాడిన ఈ సాంగ్ ఆకట్టుకుంటుంది. ఏప్రిల్ 19న రిలీజ్ అవుతున్న ఈ సినిమాతో నాని మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ ఈ సినిమా నిర్మిస్తున్నారు.