
మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ హీరోగా కిశోర్ తిరుమల డైరక్షన్ లో వస్తున్న సినిమా చిత్రలహరి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో తేజూ సరసన నివేదా పేతురాజ్, కళ్యాణి ప్రియదర్శిని నటిస్తున్నారు. ఏప్రిల్ 12న రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అదరగొడుతుంది. వరుసగా 6 ఫ్లాప్ సినిమాలు తీసినా సరే సాయి ధరం తేజ్ కు మార్కెట్ బాగానే ఉంది.
చిత్రలహరి సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఏపి, తెలంగాణా రెండు ఏరియాల్లో కలిపి 15 కోట్లకు కొనేశాడట. వరల్డ్ వైడ్ గా చిత్రలహరి 18 నుండి 20 కోట్ల దాకా బిజినెస్ జరుగుతుందట. మెగా ఫ్యాన్స్ అందడండలు ఉన్న తేజూ సరైన కథలు ఎంపిక చేసుకోవడంలో వెనుకపడ్డాడు. అందుకే వరుసగా అపజాయాలు అతన్ని పలకరించాయి. అయితే చిత్రలహరి సినిమా మీద మాత్రం తేజూ పూర్తి నమ్మకంగా ఉన్నాడు. దిల్ రాజు కొన్నాడంటే కచ్చితంగా సినిమాలో మ్యాటర్ ఉన్నట్టే అనిపిస్తుంది.