
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత ఇంటర్నేషనల్ ఫిగర్ అయ్యాడు. బాహుబలి ముందు వరకు కేవలం సౌత్ హీరోగా మాత్రమే ఉన్న ప్రభాస్ ఇప్పుడు ప్రపంచమంతా తెలిసిన హీరోగా క్రేజ్ తెచ్చుకున్నాడు. మరి అలాంటి హీరో మన ఎదురుగా కనిపిస్తే ఏం చేస్తాం ఎగిరి గంతేస్తాం కదా అచ్చం అలానే ఓ ప్రభాస్ అభిమాని ప్రభాస్ ఓ ఎయిర్ పోర్ట్ లో కనబడగానే అతనితో సెల్ఫీ దిగింది.. అది చాలదు అన్నట్టు ప్రభాస్ ను తన చేత్తో తాకింది.. ఆ తర్వాత ఎగిరి గంతులేసింది.
ప్రభాస్ ఆ వీర అభిమానిని చూసి నవ్వుకున్నాడు. ఇక ఆ తర్వాత అమ్మాయితో పాటుగా మరికొందరు ఫ్యాన్స్ ప్రభాస్ తో కలిసి ఫోటోలు దిగారు. ప్రభాస్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో ఇది చూస్తే తెలుస్తుంది. ప్రస్తుతం సాహో సినిమా చేస్తున్న ప్రభాస్ ఆ తర్వాత జాన్ సినిమా చేస్తున్నాడు. ఈమధ్యనే షేడ్స్ ఆఫ్ సాహోగా వచ్చిన మేకింగ్ వీడియో ప్రభాస్ ఫ్యాన్స్ ను, సిని ప్రేక్షకులను అలరించింది.