రుద్రవీణ ఫ్లాప్ షాక్ ఇచ్చింది..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాలచందర్ డైరక్షన్ లో వచ్చిన సినిమా రుద్రవీణ. 1988లో వచ్చిన ఆ సినిమాతో నిర్మాతగా మారారు మెగా బ్రదర్ నాగబాబు. చదువుకుంటున్న తనని తీసుకొచ్చి నిర్మాతగా మారమని ప్రోత్సహించాడట చిరంజీవి. అప్పట్లోనే 90 లక్షల బడ్జెట్ తో ఆ సినిమా నిర్మించారట. శంకరాభరణం లాంటి హిట్ సినిమా అవుతుందని భావించగా అది కాస్త ఫలితం తలకిందులు అయ్యిందట.

అప్పటికే శంకరాభరణం, సొంధూరభైరవి సినిమాలు సూపర్ హిట్ అవడంతో అలాంటి క్లాసిక్ మూవీ తీసి హిట్ కొడదామని అనుకున్న మెగాస్టార్ చిరంజీవి ఐడియా వర్క్ అవుట్ కాలేదు. శంకరాభరణం లాగా లాభాలు తెస్తుందని అనుకున్న ఆ సినిమా నష్టాలను మిగిల్చిందట. ఈ విషయాన్ని నాగబాబు తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా వెళ్లడించారు. అయితే జాతీయ అవార్డ్ వచ్చినప్పుడు మాత్రం చాలా సంతోష పడ్డామని చెప్పాడు నాగబాబు.