మహేష్ సినిమాలో ఆ ఇద్దరు కన్ఫాం

సూపర్ స్టార్ మహేష్ మహర్షి సినిమా తర్వాత సుకుమార్ సినిమా చేస్తాడని అనుకోగా మహాశివరాత్రి రోజు సడెన్ గా ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందని ట్విట్టర్ ద్వారా వెళ్లడించాడు. మహర్షి సినిమా ఏప్రిల్ 25న రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సుకుమార్ సినిమా ప్లేస్ లో అనీల్ రావిపుడితో మహేష్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాను దిల్ రాజు, అనీల్ సుంకర కలిసి నిర్మిస్తారని ఫిల్మ్ నగర్ టాక్.


ఇక ఈ సినిమాలో మహేష్ సరసన హీరోయిన్స్ గా టాలీవుడ్ క్రేజీ బ్యూటీస్ రష్మిక మందన్న, సాయి పల్లవి ఇద్దరు సెలెక్ట్ అయ్యారట. అఫిషియల్ గా ఎనౌన్స్ చేయలేదు కాని మహేష్ సినిమాలో ఈ హీరోయిన్స్ ఇద్దరికి ఛాన్స్ వచ్చేసిందట. స్టార్ ఛాన్స్ అసలు వదల్ని హీరోయిన్స్ మహేష్ లాంటి హీరో పక్కన అవకశాన్ని ఎలా వదులుకుంటారు. మరి మహేష్, రష్మిక, సాయి పల్లవి క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.