సుకుమార్, బన్ని.. ఆర్య-3..!

గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయమైన అల్లు అర్జున్ తర్వాత సినిమా ఆర్య చేశాడు. సుకుమార్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ట్రెండ్ సృష్టించింది. అంతేకాదు సుకుమార్, బన్నిల స్నేహానికి మంచి బలం చేకూర్చింది. 2004 లో వచ్చిన ఆర్య సినిమాతో అదరగొట్టిన సుకుమార్ ఆ తర్వాత మళ్లీ బన్నితో ఆర్య-2 సినిమా చేశాడు. ఆ సినిమా కూడా బన్ని ఫ్యాన్స్ ను మెప్పించింది.

ఇక ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి ఆర్య-3 చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం త్రివిక్రం సినిమాకు ఓకే చెప్పిన అల్లు అర్జున్ ఆ తర్వాత సుకుమార్ సినిమా చేస్తాడని తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తుందట. అల్లు అర్జున్ 20వ సినిమా సుకుమార్ డైరక్షన్ లో రాబోతుంది. మరి వీరు చేసేది ఆర్య సీక్వలా కాదా అన్నది తెలియాల్సి ఉంది.