కార్తి 'ఖైది' అవుతున్నాడు..!

ఎంచుకున్న కథకు సరితూగే టైటిల్ పెట్టడమనేది దర్శకుడి టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది. కొందరు ఆల్రెడీ ప్రేక్షకుల్లో బాగా తెలిసిన టైటిల్ ను వాడేస్తుంటారు. అలా పెట్టడం వల్ల సినిమా కథ ముందే చెప్పినట్టు అవుతుంది. ఇక సీనియర్ స్టార్ హీరోల టైటిల్స్ మీద కుర్ర హీరోల కన్ను ఎప్పుడూ ఉంటుంది. ఆ క్రమంలోనే నాచురల్ స్టార్ నాని, విక్రం కుమార్ తో చేసే సినిమాకు గ్యాంగ్ లీడర్ అని టైటిల్ పెట్టుకున్నాడు.

మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో గ్యాంగ్ లీడర్ ఓ సూపర్ డూపర్ హిట్ మూవీ. ఆ టైటిల్ తో రాం చరణ్, అల్లు అర్జున్ సినిమా చేస్తారని అనుకుంటే నాని ఆ ఛాన్స్ కొట్టేశాడు. ఇక ఇప్పుడు మరో మెగాస్టార్ టైటిల్ తో కార్తి ప్రయోగం చేస్తున్నాడు. కార్తి హీరోగా మా నగరం ఫేమ్ లోకేష్ కనకరాజ్ డైరక్షన్ లో కోలీవుడ్ లో ఓ సినిమా వస్తుంది. ఆ సినిమాకు టైటిల్ గా ఖైది అని ఫిక్స్ చేశారట. కార్తికి తెలుగులో కూడా మార్కెట్ ఉన్న కారణంగా ఈ సినిమాను ఇక్కడ రిలీజ్ చేయాలని చూస్తున్నారు. అంటే తెలుగులో మరో ఖైదిగా కార్తి వస్తున్నాడన్నమాట. కార్తి సరసన రష్మిక మందన్న నటిస్తున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.