'మా' ఎన్నికలు.. టాలీవుడ్ లో అంతర్యుద్ధం..!

మార్చి 10న మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ అధ్యక్షుడి ఎన్నికలు జరుగనున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు శివాజి రాజాకి పోటీగా సీనియర్ హీరో నరేష్ ఈసారి అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ నిధుల విషయంలో శివాజి రాజా, నరేష్ ల మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. వారిద్దరే అధ్యక్ష పదవికి పోటీ పడటం హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు టాలీవుడ్ లో కొందరు శివాజి రాజాకి సపోర్ట్ గా ఉంటే.. మరికొందరు నరేష్ కు సపోర్ట్ గా ఉంటున్నారట.

మెగాస్టార్ చిరంజీవి, శ్రీకాంత్ వారి సపోర్ట్ తో శివాజి రాజా ముందుకెళ్తున్నాడు. నరేష్ పక్కన మాజి మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్, మురళి మోహన్ ఉన్నారని తెలుస్తుంది. సూపర్ స్టార్ మహేష్ కూడా నరేష్ కు సపోర్ట్ చేస్తాడని చెప్పొచ్చు. మొత్తానికి మా ఎన్నికలు మరోసారి టాలీవుడ్ లోని సెలబ్రిటీల మధ్య ఉన్న అతర్యుద్ధాన్ని తెలియచేస్తుంది. ఈసారి అధ్యక్షుడిగా ఎవరు గెలుస్తారు అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. అయితే పేద కళాకారుల సపోర్ట్ ఉండటం వల్ల శివాజి రాజానే మళ్లీ మా అధ్యక్షుడిగా వస్తాడని అంటున్నారు.