
టాలీవుడ్ లిప్ లాక్ ట్రెండ్ మొదలు పెట్టిన మన అర్జున్ రెడ్డి అలియాస్ విజయ్ దేవరకొండ తను ఏ సినిమా చేసినా అందులో హీరోయిన్ తో మూతి ముద్దులు ఉండాల్సిందే. ముఖ్యంగా అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ సినిమా అంటే ఆడియెన్స్ వాటిని ఆశిస్తున్నారు. లాస్ట్ ఇయర్ వచ్చిన టాక్సీవాలాలో కూడిన అదరచుంభనం కానిచ్చిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం చేస్తున్న డియర్ కామ్రేడ్ సినిమాలో కూడా ఆ ట్రెండ్ కొనసాగిస్తున్నాడట.
భరత్ కమ్మ డైరక్షన్ లో విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటిస్తున్న సినిమా డియర్ కామ్రేడ్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో విజయ్ స్టూడెంట్ లీడర్ గా నటిస్తున్నాడు. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో రష్మికతో లిప్ లాక్ సీన్స్ ఉంటాయట. గీతా గోవిందంలో ఈ ఇద్దరి జంట అలరించింది. ఆ మ్యాజిక్ తో పాటుగా ఇప్పుడు ఇద్దరి రొమాన్స్ కూడా సినిమాకు హైలెట్ అవనుంది. మరి విజయ్, రష్మికల ముద్దు ముచట్లు ఎలా ఉంటాయో సినిమా వస్తేనే కాని చెప్పలేం.