యాత్ర డైరక్టర్ కు అదిరిపోయే ఛాన్స్..!

వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితంలోని ముఖ్య ఘట్టాలతో మహి వి రాఘవ్ తెరకెక్కించిన సినిమా యాత్ర. విజయ్ చిల్లా, శషి దేవి రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 8న రిలీజై మంచి విజయాన్ని అందుకుంది. వైఎస్ పాదయాత్ర నేపథ్యంతో వచ్చిన యాత్ర సినిమాలో మళయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించారు. తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో రిలీజైన ఈ సినిమా దర్శకుడికి మంచి పేరు తీసుకొచ్చింది.

ఇక ఈ సినిమా మళయాళ వర్షన్ ను రీసెంట్ గా చూసిన మమ్ముట్టి తనయుడు యువ హీరో దుల్కర్ సల్మాన్ డైరక్టర్ మహి వి రాఘవ్ ను పిలిపించుకుని మరి మెచ్చుకున్నారట. తనకు సూటయ్యే కథను సిద్ధం చేయమని చెప్పాడట దుల్కర్ సల్మాన్. మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన దుల్కర్ సల్మాన్ తమిళంలో కూడా ఓకే కన్మణి సినిమాతో మెప్పించాడు. ఒకవేళ మహి వి రాఘవ్ అతనితో సినిమా చేస్తే ఆ సినిమా కూడా తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో తెరకెక్కించే అవకాశం ఉంది.