మహేష్ తో సిగరెట్ మానిపించిన స్నేహితుడు..!

సూపర్ స్టార్ మహేష్ ఇప్పుడు పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్ అయ్యాడు.. ఎప్పుడన్న పెద్ద పార్టీ అయితే తప్ప ఆల్కహాల్ ను కూడా దగ్గరకు రానివ్వట్లేదని తెలుస్తుంది. కెరియర్ మొదట్లో మహేష్ ఎక్కడ ఉంటే అక్కడ సిగరెట్ ఉండాల్సిందే. పెళ్లికి ముందు దాకా మహేష్ ఓ చైన్ స్మోకర్ అని తెలుస్తుంది. రోజుకి 2,3 పెట్టల సిగరెట్ కాల్చాసిందేనట. అయితే ఓ స్నేహితుడు వల్ల మహేష్ సిగరెట్ ను పూర్తిగా దూరమయ్యాడని తెలుస్తుంది.     

ఇంతకీ మహేష్ తో సిగరెట్ మానిపించిన ఆ స్నేహితుడు ఎవరు అంటే అలెన్ కార్ రాసిన ఈజీ వే టూ స్టాప్ స్మోకింగ్ బుక్ అని తెలుస్తుంది. ఓ స్నేహితుడు ఆ బుక్ చదవని ఇవ్వగా అది చదివి మహేష్ పొగతాగడం మానేశాడట. మరి ఇంతకీ ఆ బుక్ లో ఏం రాసింది అంటే ఓసారి చదవాల్సిందే. మీరు లేదా మీ స్నేహితులు ఎవరైనా చైన్ స్మోకర్ అయ్యుంటే వారికి ఈ బుక్ కొనివ్వండి ఫలితం ఏమైనా ఉంటుందేమో ఓసారి ట్రై చేస్తే పోలా!